19-07-2025 02:05:47 AM
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): నేడు ఉస్మానియా యూని వర్సిటీలో వీసీల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వర్సిటీలు, కాలేజీల న్యాక్ గుర్తింపుతోపాటు, వర్సిటీలకు ఖర్చు చేసే, చేసిన నిధులపై చర్చించనున్నారు. ఒక్కో వర్సిటీ వీసీ.. పది నుంచి 15 నిమిషాలు పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు హాజరుకానున్నట్లు తెలిసింది.