calender_icon.png 23 November, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు లోయలో పడి 8 మంది మృతి

27-07-2024 07:39:51 PM

జమ్మూ కాశ్మీర్‌: అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సుమ్ లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం కిష్త్వార్ నుంచి సింథాన్ టాప్ మీదుగా మార్వా వైపు టాటా సుమోలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న టాటా సుమో దక్సమ్ సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది.

దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మృతుల్లో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని, వారు కిష్త్వార్ నుంచి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.