calender_icon.png 10 January, 2026 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి పోటీలకు వెంకటేష్ ఎంపిక

06-01-2026 12:00:00 AM

కరీంనగర్ క్రైం, జనవరి 5 (విజయ క్రాంతి): ప్రతిష్టాత్మకమైన సీనియర్ జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు సివిల్ కానిస్టేబుల్ ఎం. వెంకటేష్ ఎంపికయ్యారు. ఈ నెల 10 నుండి 15 వరకు వరంగల్ వేదికగా జరగనున్న ఈ పోటీల్లో ఆయన ’ఆల్ ఇండియా పోలీస్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి పురుషుల విభాగంలో ఇద్దరు, మహిళల విభాగంలో ఇద్దరు క్రీడాకారులు ఈ పోటీలకు ఎంపిక కాగా పురుషుల విభాగం నుండి ఎంపికైన ఆ ఇద్దరిలో ఒకరిగా వెంకటేష్ నిలవడం విశేషం.

ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ జాతీయ స్థాయికి ఎంపికైన వెంకటేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి కమిషనరేట్ కు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ ఎంపిక పట్ల తోటి పోలీస్ సిబ్బంది మరియు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసారు.