26-11-2025 12:00:00 AM
కుబీర్, నవంబర్25 (విజయక్రాంతి) : మండలంలోని వివిధ గ్రామా ల్లో యాసంగి వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. వానాకాలం సీసన్ ముగియడంతో సాగునీటి బోర్లు బావు లు చెరువుల కింద రైతులు మొక్కజొన్న వరి గోధుమ జొన్న శనిగి తదితర పం టలను వేసుకుంటున్నారు.
మండలం లో యాసంగిలో మొక్కజొన్నవైపు రైతు లు ఆసక్తి చూపుతున్నారు. ఈ పంటకు పెట్టుబడి తక్కువ కావడం మార్కెట్లో డిమాండ్ ఉండడం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర దక్కుతుందన్న ఆశతో రైతులు ఈ మొక్కజొన్నలు సాగు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు