calender_icon.png 26 November, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ప్రిన్సిపాల్ మాకొద్దంటూ రోడ్డెక్కిన విద్యార్థులు

26-11-2025 12:00:00 AM

  1. చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపణ
  2. స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

ఆదిలాబాద్, నవంబర్ 25, (విజయక్రాంతి) :  ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ ఇచ్చోడ మండల కేంద్రంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక విద్యార్థులు రోడ్డెక్కారు. మంగళవారం మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో విద్యార్థులు తమను ప్రిన్సిపాల్ వేదిస్తున్నాడంటు వసతి గృహంను విడిచి ప్రధాన రోడ్డు పై పరుగులు తీశారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డు పై పడుకుని నిరసన తెలిపారు.

ప్రిన్సిపాల్ తరచు వేధించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరు స్తున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థులు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసన తెలుపుతున్న విద్యార్థుల ను సముదాయించి, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.  ఈ సందర్భంగా సీఐ రాజు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాలకు పంపించారు.