28-07-2025 11:36:33 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): పటాన్ చెరు నియోజకవర్గంలోని బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్(BDL Bhanur Police Station) ఎస్ హెచ్ గా సీఐ సీహెచ్ విజయకృష్ణ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ సీఐగా పనిచేసిన స్వామిగౌడ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయ కృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయకృష్ణ మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.