28-07-2025 11:39:16 PM
మేడిపల్లి: ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామన్నపేటకు చెందిన ఎర్ర పోయిన నరేష్(35) తండ్రి భాషయ్య, సొంత ఊర్లో అప్పులు అయ్యాయని బోడుప్పల్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీకి తన భార్యా పిల్లలతో వచ్చి కూలి పని చేసుకుంటూ ఉంటున్నాడు. మద్యానికి బానిసై తేదీ 27న సాయంత్రం 6 గంటల సమయంలో తన ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. తండ్రి మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.