calender_icon.png 26 December, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిట్ల పురాణం మొదలు పెట్టిందే కేసీఆర్

26-12-2025 02:08:22 AM

  1. సీఎంను తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకోవాలా?
  2. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): రాజకీయాల్లో తిట్ల పురాణం మొద లు పెట్టిందే కేసీఆర్ అని, ఉద్యమ సమయంలో నోటికి వచ్చినట్లు మాట్లాడారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా రాజకీయాలు మా ట్లాడుతారని, కేసీఆర్ తిట్ల పురాణం మాట్లాడితే.. రేవంత్‌రెడ్డి మీకంటే ఎక్కువ తిట్లు తిట్టగలరని గురువారం ఆయన ఒక ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా హరీశ్‌రావు వ్యవహారశైలి ఉందని ఎంపీ చామల విమర్శించారు. 

కేసీఆర్ ఓడిపోయాక రెండేళ్ల తర్వాత బయటికి వచ్చి తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తిని తోలు తీస్తామంటే తాము మర్యాదగా మాట్లాడాలా..? అని ఎంపీ చామల ప్రశ్నించారు. నీళు, నిజాలపై అసెంబ్లీలో చర్చ చేయడానికి కేసీఆర్ రావాలని ఎంపీ చామ ల సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి ఛాలెంజ్ చేసి 2023లో బీఆర్‌ఎస్‌ను ఓడించారని, 2029లోనూ మళ్లీ ఓడిస్తారని తెలిపారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకరినొకరు గౌరవించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నా రని, తాము చెప్పే అంశాలను ఆ దద్దమ్మలకు బండి సంజయ్ చెప్పాలని విజ్ఞప్తి చేస్తు న్నట్లు తెలిపారు.