calender_icon.png 11 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పల్లె పోరు

11-12-2025 12:00:00 AM

  1. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
  2. పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది, సామగ్రి
  3. మధ్యాహ్నం వరకు ఓటింగ్.. సాయంత్రం కౌంటింగ్...
  4. పోలీసులతో గట్టి బందోబస్తు...
  5. ఏర్పాట్లను పరిశీలించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు

ఆదిలాబాద్/కుమ్రం భీం ఆసిఫాబాద్/నిర్మల్, ఖానాపూర్/మంచిర్యాల, డిసెంబర్ 10 (విజయక్రాంతి): జిల్లాలో జరిగే తొలి విడత పల్లె ఓట్లకు సర్వం సిద్ధం అయింది. పంచాయతీ సమరం ప్రారంభం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిం ది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొం డ, ఇచ్చోడ మండలాల్లో 116 పంచాయతీ సర్పంచ్‌లకు, 1, 390 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి.

గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యా హ్నం 1 గంట వరకు కొనసాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది. దీని కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్ లు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేయగా, పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్సీ బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. 

తొలి విడత ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 936 మంది పోలీ సులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ లో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.

అటు మొదటి విడతలో భాగంగా 6 మండలాలలో ఎన్నికలు జరగనుండగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 39 క్లస్టర్లు, 34 రూట్లతో 166 గ్రామాలలో 225 పోలింగ్ లొకేషన్‌లలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 938 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

తరలివెళ్లిన సిబ్బంది..

జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికలు జరిగే పంచాయతీలకు పోలింగ్ అధికారులు, సిబ్బం ది, పోలీసులు సామాగ్రితో బుధవారం తరలివెళ్లారు. సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి పోలీసు బందోబస్తు మధ్య ఆయా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో సిబ్బందిని తరలించారు. జిల్లాలో మారుమూల ప్రాంతాలతో పాటు సమస్యాత్మక, అత్యంత సమస్యా త్మక పోలింగ్ కేంద్రాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో 144సెక్షన్ అమ ల్లో ఉండనుంది.

మరోపక్క జిల్లా ఎన్నికల అధికారులతో పాటు అబ్జార్వర్ల, పరిశీలకులు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షనించనున్నారు. మరోపక్క ఆయా పోలింగ్ కేంద్రల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసు యం త్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తోం ది. ఇప్పటికే ఎన్నికల నియమావలి పై గ్రామస్తులకు అవగాహన కల్పించగా.. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదని సూచించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం 

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం జరగనున్న కుమ్రం భీం అసిఫాబా ద్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యు ల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రం సర్వం సిద్ధం చేసింది. మొదటి విడుదల వాంకిడి, కెరమెరి, జైనుర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాలలో ఎన్నికలు జరగనుండగా బుధవారం ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలి వెళ్లారు.

కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాలలో 107 గ్రామపంచాయతీ లు, 368 వార్డులలో ఎన్నికలు జరగ నుండగా 855 మంది పోటి పడుతున్నారు. 107 గ్రామ పంచాయతీలకు 107 మంది ఆర్ ఓలను కేటాయించగా, 1133 మంది పోలింగ్ అధికారుల ను నియమించారు.1208 మంది ఇతర పోలింగ్ అధికారులను ఏర్పాటు చేశారు.

నేడు సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల కు పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గత వారం రోజులపాటు గిరి పల్లెలో ఎన్నికల సందడి హడావుడిగా ఉండింది. రాజకీయ పండుగ వాతావరణం పల్లెల్లో నెలకొంది. అభ్యర్థులు వారి వారి పరిధిలోని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకున్నారు.

పకడ్బందీగా ఎన్నికలు: కలెక్టర్, ఎస్పీ 

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మొదటి విడత లో భాగంగా జిల్లాలోని ఐదు మండలాలలో జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, శాంతియుత వాతావరణంలో ఓటింగ్ పూర్తి జరిగేలా భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. బుధవారం ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. ఎన్నికలలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారుల పిలుపు

గ్రామపంచాయతీ మొదటి విడత పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేసినట్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ కడెం పెంబి ఖానాపూర్ లక్ష్మణ చందా మామడ మండలాల పరిధిలో 136 సర్పంచులకు గాను 16 సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 120 గ్రామపంచాయతీలో 454 మంది పోటీ చేస్తున్నారు.

వార్డు సభ్యు లు 1072 వార్డులకు 1370 వార్డులకు పోటీ చేయగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో గురువా రం ఎన్నికలు ఉంది ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహించి రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పట్లను పూర్తి చేయడం జరిగిందని ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని శాంతి భద్రత వివా దం కలిగించిన ఓటర్లను ప్రలోభాల గురిచేసిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించా రు.

ఇదిలా ఉండగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా మండలాలకు అధికారులు చేరుకున్నారు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల జిల్లా అధికారులు పరిశీలించి ఎన్నికల సిబ్బంది ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు: కుమార్ దీపక్ 

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న పోలింగ్ లో అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. బుధవారం జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల, దండేపల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హాజీపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్యతో కలిసి లక్షెట్టిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మొదటి విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటింగ్, కౌంటింగ్ కొరకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. మొదటి విడతలో భాగంగా ఈ నెల 11వ తేదీన జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలలో ఏకగ్రీవం అయిన స్థానాలను మినహాయించి మిగిలిన 81 గ్రామపంచాయతీ సర్పంచ్, 514 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

2 వేల 600 మంది పోలింగ్ విధులు, 400 పోలీస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని, 24 వెబ్ కాస్టింగ్ లొకేషన్ల ద్వారా 200 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఉంటుందని, 20 మంది సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్ధుల ప్రచారం ముగిసిందని, ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించాలని, గత ఎన్నికలలో 85.26 శాతం ఓటింగ్ నమోదు అయిందని, ఈసారి 90 శాతం నమోదు జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మీడియా ప్రతినిధులు అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లాలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు

లక్షెట్టిపేట టౌన్, డిసెంబర్ 10: లక్షెట్టిపేట మండలంలో ఏర్పాటు చేసిన పంచా యతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను బుధ వారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మనోహర్ పరిశీలించారు. లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పంచాయితీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించి వివరాలు సేకరించి అవసరమైన సూచనలను అధికారులకు అందజేశారు.

ఆయన వెంట లక్షెట్టిపేట తహసిల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీవో సరోజ, రెవెన్యూ,  మండల పరిషత్ అధికారులు ఉన్నారు. మండలంలోని గ్రామ పంచాయతీల్లోని ఎన్నికల పోలింగ్ సెంటర్లను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్ర య్య, ఆర్డిఓ శ్రీనివాస్ రావు, మంచిర్యాల ఏసిపి ప్రకాష్ లు పరిశీలించారు.

వెబ్ కాస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి 

నస్పూర్, డిసెంబర్ 10 : ఈ నెల 11న జరగనున్న మొదటి విడత పోలింగ్‌లో భాగంగా వెబ్ కాస్టింగ్ నిర్వహణ పకడ్బం దీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధ వారం  కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమ స్యాత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ నిర్వహణను జిల్లా అదనపు కలెక్టర్ (రెవె న్యూ) చంద్రయ్యతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ మొదటి విడతలో జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీ పూర్ మండలాలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వ హించాలని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా లో గుర్తించిన 24 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు పోలీసు బందోబస్తు: ఎస్పీ జానకి

నిర్మల్ జిల్లాలో గురువారం జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ పోలీ స్ శాఖ తరఫున పోలీసు బంధుబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించి పోలీ స్ సిబ్బంది ఎన్నికల నియమాలను పాటి స్తూ ఎన్నికలు ప్రశాంతంగా పకడ్బందీగా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని ఆదేశించారు.

ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేసుకునేలా పోలీసులు సహకరించాలని పోలింగ్ కేం ద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుంద ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పమన్నారు. ఫలితాల అనంతరం గ్రామాల్లో ఎటువంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పా టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అవినాష్ కుమార్ ఉపేందర్రెడ్డి పోలీసులు పాల్గొన్నారు.