calender_icon.png 10 October, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలిండియా పోటీల్లో సింగరేణి ఖ్యాతిని చాటాలి

09-10-2025 08:08:42 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి క్రీడాకారులు కోలిండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి సింగరేణి ఖ్యాతిని చాటాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, క్రీడల గౌరవ కార్యదర్శి, సీనియర్ పిఓ ఎం కార్తీక్ లు కోరారు. ఏరియా వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్(డబ్ల్యూపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 21 వార్షిక క్రీడల్లో భాగంగా పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం నిర్వహించిన డిపార్ట్మెంటల్ వాలీబాల్ పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై, పోటీలను ప్రారంభించి మాట్లాడారు.

సింగరేణి ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, కళాకారులు కోలిండియా స్థాయిలో ప్రతి సంవత్సరం ఎన్నో బహుమతులు సాధించి, సింగరేణికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారన్నారు. సీనియర్ క్రీడాకారులు సంస్థలో పని చేస్తున్న యువ ఉద్యోగు లను, క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచిం చారు. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాక శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని తెలిపారు. ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధికి దోహదం చేసిన వారవుతా రన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శాఖ శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.