calender_icon.png 10 October, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోంగార్డు కుటుంబానికి పోలీసుల చేయూత..

09-10-2025 08:05:52 PM

చిట్యాల (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి పోలీసు ఉన్నతాధికారులు గురువారం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి చేయూతనందించారు. గురువారం ఉదయం రామన్నపేట పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఉపేందర్ చారి వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తుతెలియని కంటైనర్ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు ఉన్నతాధికారులు అతని మృతికి సంతాపం తెలియజేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి అండగా తక్షణమే సీపీ సుధీర్ బాబు రాచకొండ హోంగార్డ్ సంక్షేమం నుంచి 10,000 రూపాయలు, భువనగిరి హెడ్ క్వార్టర్స్ తరపున అడిషనల్ ఎస్పీ, ఆర్ఐ, ఆర్ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, ఉమెన్ పోలీస్ కలిసి లక్ష రూపాయలను అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ శ్రీనివాస్, హెడ్ క్వార్టర్స్ తరఫున వారి కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేశారు.