09-10-2025 08:03:01 PM
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్..
ముకరంపుర (విజయక్రాంతి): 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టమైన విధానాలతో మొదటి నుండి బీసీలకు చట్టబద్ధంగా రావలసిన 42 శాతం రిజర్వేషన్లు రాకుండా కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. ఇంద్ర సనాని కేసులో 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ అసెంబ్లీలో తీర్మానం చేసిన గవర్నర్ అమోదం పొందితేనే అది చట్టంగా మారుతుందని తెలిపారు. ఇవన్నీ తెలిసి కూడ 42 శాతానికి జీవో ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసిందని, న్యాయస్థానం ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మొదటి నుండి కూడ చిత్తశుద్ధి లేదనేది కోర్టు నిర్ణయంతో తేలిపోయిందని తెలిపారు.