09-10-2025 07:58:19 PM
శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్..
కోదాడ: పట్టణంలోని వ్యాపారులు ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానాలు తప్పదని కోదాడ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ అన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ప్రత్యామ్నాయంగా బయోడేక్రికల్ కవర్లు వాడాలని గురువారం కోదాడ పట్టణంలోని హోటల్, టిఫిన్ సెంటర్, పండ్ల షాపుల యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... వివిధ దుకాణాల యజమానులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాల్లోనే నేరుగా చెత్తను వేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసిన వారిపై మున్సిపల్ నిబంధనల ప్రకారం చలానాలు విధిస్తామని అన్నారు.