09-10-2025 08:11:14 PM
హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ ప్రభుత్వ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వృక్షశాస్త్ర ఆచార్యులు డాక్టర్ తిరునహరి యుగంధర్, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచిత వృక్షశాస్త్ర జీవ వైవిధ్యం సంరక్షణ అనే అంశానికి సంబంధించిన నోట్స్ పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతి, జ్ఞాన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్. యుగంధర్ యొక్క సేవలు కొనియాడుతూ "ఆచార్యులు విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తేనే నవసమాజ నిర్మాణం సాధ్యం" అని పేర్కొన్నారు.
ఫోర్త్ సెమిస్టర్‌లో ఓ గ్రేడ్ , ఏ గ్రేడుమార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి నోట్స్ అందజేశారు. అలాగే చివరి సంవత్సరం (ఫైనల్ ఇయర్) విద్యార్థులకూ నోట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఇ. కోమల, డాక్టర్.శ్యాం ప్రసాద్ పాలకు, డాక్టర్. సమ్మయ్య, డాక్టర్. గన్ సింగ్, డాక్టర్.నరేందర్, డాక్టర్.గాంధీ, డాక్టర్.వాసం శ్రీనివాస్, డాక్టర్. పాలకుర్తి దినకర్, లైబ్రరీ కోఆర్డినేటర్ డాక్టర్.భరత్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్.డాక్టర్ శ్రీను, డాక్టర్ కిరణ్, డాక్టర్.రామ్ భాస్కర్ లు యుగంధర్ ని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా అందరు ఆచార్యులు విద్యార్థుల విద్యా ప్రగతిని అభినందిస్తూ, విద్యార్థులు మరింత ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.