calender_icon.png 6 November, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుమీదున్న విష్వక్..

08-07-2024 12:05:00 AM

ఈ ఏడాదిలో ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలను తెరపైకి తీసుకొచ్చారు కథానాయకుడు విష్వక్‌సేన్. ప్రస్తుతం ‘మెకానిక్ రాఖీ’గా ముస్తాబవుతున్న ఈ యువ హీరో, ‘లైలా’ పేరిట ఇటీవల మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా విష్వక్ ఖాతాలో చేరనున్నాయి. ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ సైతం ఆయన కోసం ఓ కథని సిద్ధం చేశారట. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మరికొందరు నిర్మాతలు కూడా విష్వక్‌తో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. వీటిలో ‘మెకానిక్ రాఖీ’ యాక్షన్ జానర్‌లో రానుండగా, అనుదీప్ సినిమా వినోదాత్మకంగా ఉండనుంది. కొత్త తరహా పాత్రలు, కథలతో తన సినీ ప్రయాణం సాగిస్తున్న విష్వక్, ‘లైలా’లో మహిళగా కనపడనున్నారు. ఏదేమైనా తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోల్లో విష్వక్ మంచి జోరుమీదున్నాడన్నది అసలు విషయం.