calender_icon.png 22 September, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

22-09-2025 12:10:27 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 21 :సంగారెడ్డి అంబేద్కర్ మైదానంలో సంగారెడ్డి వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ డే వాలీబాల్ టోర్నమెంట్ ముగిసింది. సంగారెడ్డి వాలీబాల్ క్లబ్ టీం సభ్యులు ఆదిల్ పాషా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొత్తం 20 టీమ్ లు పాల్గొన్నాయి. అంతకు ముందు వాలీబాల్ టోర్నమెంట్ ను తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు గోపాల్ టాస్ వేసి ప్రారంభించారు.

అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి అదిల్ పాషా ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ప్రథమ స్థానంలో నిలిచిన సంగారెడ్డి ఆదిల్ పాషా టీమ్ కు 5 వేల నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ టీం కు 2 వేల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో డా.మధు, సేనాపతి, జియా, నర్సింలు, సురేష్, పవన్, క్రీడాకారులు పాల్గొన్నారు.