06-12-2025 12:21:42 AM
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
చారకొండ, డిసెంబర్ 5: గ్రామాలను అభివృద్ధి చేయగలిగే వారిని సర్పంచ్ ఎన్నికలో గెలిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే డాక్టర్. చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థి బలరాం గౌడ్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు డా. చారకొండ వెంకటేష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారకొండ మండల కేంద్రంలో మండల కాంప్లెక్స్ భవనాలను నిర్మించడానికి రూ. 35 కోట్లను నెల రోజులలోపే మంజూరు చేస్తామన్నారు.
మండల కేంద్రంలో నాలుగు లైన్ల రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి 40 కోట్లు త్వరలోనే తీసుకువచ్చి చూపిస్తామని అన్నారు. శిరుసనగండ్ల దేవాలయానికి రూ. 100 కోట్లు ప్రతిపాదనలు పంపామని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు చాలా సంతృప్తితో ఉన్నారని వారే గ్రామ అభివృద్ధికి సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధమై ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల మోసపూరిత మాటలు నమ్మవద్దని సూచించారు. కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, జెసిబి వెంకటయ్య, జగన్, ప్రశాంత్ నాయక్, శ్రీను, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.