calender_icon.png 9 July, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యానికి వాకింగ్ యోగా

25-05-2025 12:00:00 AM

వాకింగ్ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇది రక్త ప్రసరణ నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎంతో మేలు చేస్తుంది. అయితే మీరెప్పుడైనా వాకింగ్ యోగా గురించి విన్నారా? ఈ యోగాలో వివిధ రకాలు ఉన్నాయి. నిజానికి మామూలు నడక కూడా ఒక రకమైన యోగానే అంటున్నారు యోగ నిపుణులు.

ఇది సాధారణ యోగా లాంటిది ఇది కూడా ఒక మంచి అలవాటు. ఈ యోగా నడక శరీరాన్ని, మనస్సును ప్రశాంతపరచడానికి, అంతరంగంతో అనుసంధానించడానికి మంచి అలవాటు. ఇది శరీరానికి ప్రశాంతతను ఇస్తుంది. 

ఇది సాధారణంగా చేసే యోగా కంటే చాలా భిన్నమైనది. నడక యోగాని జ్ఞానుల కదలిక అని చెప్పవచ్చు. నడకలో ప్రతి అడుగు శ్వాసలయ, శరీరానికి భూమికి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. 

నడక యోగా మనస్సు, శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని దినచర్యలో చేర్చుకోవడం మంచిది. శారీరకంగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలను బలపరుస్తుంది. కీళ్ల కదలికను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. మనసుకు ప్రశాంతత, ఏకాగ్రతను ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..

వాకింగ్ యోగా ప్రకృతికి, మనిషికి మధ్య అంతర్గత ఆత్మ సంబంధాన్ని పెంపొందిస్తుంది. ఇది మనస్సులో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఇది జీవితంలో సమతుల్యత, బుద్ధి, ఆనందాన్ని తీసుకురాగలదు. 

ఎలా చేయాలి?

వాకింగ్ యోగా ప్రారంభించే ముందు ప్రశాంతంగా ఉండటానికి కొంత సమయం తీసుకోవాలి. తర్వాత నడక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. అప్పుడు మనస్సులో శాంతి, ప్రశాంతత పెరుగుతాయి. ఏకాగ్రత కూడా ఏర్పడుతుంది. శ్వాస కదలికతో సమన్వయం చేసుకోవాలి. నాలుగు సార్లు శ్వాస తీసుకుని.. నాలుగు అడుగుల తర్వాత గాలి వదిలేయాలి. వాకింగ్ చేసేటప్పుడు సున్నితంగా ఉండాలి. భుజాలు పైకెత్తి, చేతులు చాచి నడవాలి. ఏది సులభంగా అనిపిస్తే అలా చేయాలి. 

ఉపయోగాలు

యోగా ఆసనాలు కండరాలను బలోపేతం చేస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. 

మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి తగ్గించడంలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

శ్వాసక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

యోగాలో ధ్యానం ఒక భాగం. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ఎదుటివారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి గుణాలను దూరం చేసి.. సానుకూల స్వభావాన్ని పెంపొదిస్తుంది.