30-07-2025 01:00:11 AM
నిర్మల్, జూలై ౨౯ (విజయక్రాంతి): గాంధీభవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీస్థితిగతులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేం దుకు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు.
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈనెల 31 నుండి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 4వ తేదీన ఖానాపూర్ నియోజకవర్గానికి రానున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.