29-10-2024 01:10:43 AM
విద్యాసంస్థ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
ఖమ్మం, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అనుమానాస్పదస్థితిలో ఓ ప్రైవేటు విద్యాసంస్థ వసతి గృహ వా ర్డెన్ మృతిచెందిన ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏన్కూరు మండలం రామనగర్ తం డాకు చెందిన భూక్యా రాజేశ్ ఖమ్మం శివారులోని గోపాలపురంలోని ఓ ప్రైవేటు స్కూలు వసతి గృహంలో వార్డెన్‌గా పని చేస్తున్నాడు.
సోమవారం యథావిధిగా స్కూలుకు వెళ్లిన రాజేశ్ కొన్నిగంటల తర్వాత ఎస్‌ఆర్ గార్డెన్స్ వద్ద విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న కు టుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి శరరీరంపై గాయాలను గుర్తించారు. అనంతరం మృతదేహంతో బంధువులతో కలిసి విద్యాసంస్థ ఎదుట ఆందోళనకు దిగా రు.
యాజమాన్యం నిర్లక్ష్యంతో రాజే శ్ మృతిచెందాడని ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్‌కు చేరుకు ని ఫిర్యాదు చేశారు.