calender_icon.png 10 November, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనిఖీలకు నీళ్లు!?

10-11-2025 12:49:26 AM

- ఫార్మసీల్లో నామమాత్రం తనీఖీలు 

- చేతులు దులుపుకుంటున్న ఔషధ నియంత్రణ అధికారులు

- రోగులపై ధరల బాదుడు

- అవగాహన లేని వాళ్ళతో మందుల అమ్మకాలు

- షాపుల్లో బినామీల దందా.. కానరాని ఫార్మసిస్ట్

మరిపెడ, నవంబర్9 (విజయక్రాంతి): మెడికల్ షాపుల్లో తరచూ తనిఖీలు చేసి ప్రజారోగ్యం కాపాడాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు నామమాత్రం తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని డోర్నకల్, కురివి , సిరోల్ , మరిపెడ, నరసింహుల పేట, దంతాలపల్లి, మండలంలో ప్రజ ల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ, డ్రగ్ కంట్రోల్ శాఖ నిర్లక్ష్యంతో మెడికల్ షాప్ నిర్వహకుల ఆగడాలు మితిమీరుతున్నాయి అనర్హులు షాపులను నిర్వ హిస్తున్నారు. డాక్టర్ రాసిన మందుల చీటి ఉంటేనే మందులు ఇవ్వాలి అన్న నిబంధన ఉన్నా ఎవ్వరు పాటించడం లేదు.

కొందరు షాపు యజమానులు వైద్యుల అవతారం ఎత్తి ఇంజెక్షన్లు, స్లున్లు ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అవగాహన లేమి తో ఒక మందు ఇయ్యాల్సిన చోట వేరే మం దు ఇచ్చి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పల్లెలలో ఎక్కువ శాతం వృద్దులు జ్వరానికి, నొప్పులకు మెడికల్ షాపుల పై ఆధారపడి ఉంటారు. నిబంధనలకు విరుద్ధమే అయినా అర్హత ఉండి కాస్తో కూస్తో ఔషధ పరిజ్ఞానం ఉన్న వారు మందులు ఇస్తేనే ఏమి జరుగుతుందో? అన్న భయం ఉన్న తరుణంలో కనీస పరిజ్ఞానం లేని వారు రోగులకు చికిత్స అందిం చడం, మందులు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు.

మెడికల్ షాపుల్లో కానరాని బిల్ బుక్స్

 నియోజకవర్గంలో ఉన్న మెడికల్ షాపులలో హెచ్ వన్ డ్రగ్ బిల్స్ బుక్స్ కనిపించ డం లేదు. డబ్బలాకొద్ది ట్రామడాల్ హైడ్రోక్లోరైడ్‌క్లోనజీపామ్, ఎస్సిటలోప్రం, అల్ప్రాజోలమ్ మందుల అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి. మరిపెడ మండలం లో ఓ గ్రామ పంచాయతీకి చెందిన ఓ ఆర్ ఎం పి కి మత్తు మందులు లేకపోతే చిట్టీలు రాయడానికి పెన్ను కదలకపోవడం గమనార్హం. గిరిపురం, రాంపురం, తాళ్ల ఉకల్ గ్రామాలలో నిషేధ మందుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. పల్లెటూర్లలో అమాయక ప్రజల రోగులకు జనరిక్ మందులు కట్టబెడుతూ అధిగ ధరలు వసూలు చేస్తున్నారని గ్రామాల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో మందుల షాపులలో ఇంత జరుగుతున్నా సంభందిత అధికారులు తూ తూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఎ లాంటి చర్యలు తీసుకోక పోవడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మెడికల్ షాప్ నిర్వహకులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మెడికల్ షాప్ యజమానులు మందు లు అమ్మినట్టు మా దృష్టికి వస్తే ఆ షా పులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ము. మెడికల్ షాప్ యజమానులు రో గుల వద్ద అధిక ధరలు ఎక్కువ ధర వసూలు చేస్తే 1800596969 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వండి. 

ఉమారాణి, ఔషధ నియంత్రణ అధికారి, మహబూబాబాద్