24-08-2025 07:04:29 PM
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలిసి సిఎస్ఆర్ నిధులతో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. హాస్పిటల్ వచ్చే వారికి మంచి నీటి వలన ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్య సమస్యలు రాకూడదని అందరూ బాగుండాలని ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ప్రారంభించినట్టు తెలియజేశారు. హాస్పిటల్స్ కి వచ్చే వారి కోసం మరిన్ని మంచి సదుపాయాలు తీసుకొస్తామని, అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.