calender_icon.png 26 August, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లవాగు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

26-08-2025 01:53:24 AM

విడుదల చేసిన ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి

సిర్గాపూర్, ఆగస్టు 25 : సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్) ప్రాజెక్ట్ లోని కుడి-ఎడమ కాలువల ద్వారా స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి నీటిని విడుదల చేశారు. గత ఆరేడు సంవత్సరాలుగా మట్టితో కురుకుపోయి నీరు చివరి ఆయకట్టవరకూవెళ్లకుండా మధ్యలో గండ్లు ఏర్పడి నీరు వృధా అవుతుందని ఎమ్మెల్యే ముందు చూపుతో పూడికను  తీయించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు కుడి-ఎడమ కాలువలు పూర్తిగా మట్టితో పూడుకుపోయినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు వరకు నీరును అందించడానికి సులభమైందని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో కడ్పల్ యాదవ్ రెడ్డి, మోహన్ రెడ్డి, జిత్తు రెడ్డి, మల్దొడ్డి తుకారం, జైరాజ్, కృష్ణ, బండారి సాయిలు, శ్రీనివాస్ పాటిల్ మాజీ సర్పంచ్, గుండు మోహన్, జమీల్, పురుషోత్తం, నరేందర్, రాజా గౌడ్, శ్యాంప్రసాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు, మహేశ్వర్ పాటిల్, వీరచారి, లక్ష్మయ్య, కృష్ణమూర్తి, సoతోష్, సురేష్, నరసింహారెడ్డి, ఎం.కృష్ణ, తదితరులుపాల్గొన్నారు.