26-06-2025 12:00:00 AM
ఈ సంవత్సరం ఏప్రిల్ 22న కశ్మీర్ అందాలని కనువిందుగా తిలకించేందుకు పహల్గాం వెళ్ళిన 26 మంది అమాయక పర్యాటకులను పాకిస్థాన్ తయారుచేసిన ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. వీరికి నివాళులు అర్పించేందుకు సూచనగా భారత్ ప్రభుత్వం పాకిస్థాన్‌కు సింధునది జలాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉగ్ర దేశం పాకిస్థాన్‌కు విధించిన మొట్టమొదటి శిక్ష ఇది.
ఈ సింధునది జలాలు లేకుంటే పాకిస్థాన్ బతికినా చచ్చినట్లే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న ఈ పిడుగు లాంటి నిర్ణయంతో పాకిస్థాన్ బేజారెత్తి పోయింది. పిచ్చి విమర్శలు చేసిన వారిలో పాకిస్థాన్ ప్రధానితో పాటు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న అజహర్ కూడా ఉన్నాడు.
సింధునది జలాల ఒప్పందం ప్రకారం భారతదేశం నీటిని ఇవ్వకుండా నిరాకరిస్తే తమ దేశం భారత్‌తో యుద్ధానికి దిగుతుందని పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో జర్దారి అన్నారు. ‘చేతకాని వారికి కోత లెక్కువ’ అంటే ఇదేనేమో.
పైగా ఆయనే ఒక ఉచిత పరిష్కారం చూపిస్తూ, “భారతదేశానికి రెండు ఎంపికలు ఉన్నాయి. నీటిని న్యాయంగా పంచుకోవడం లేదా ఆరు నదుల నుంచి నీటిని మేమే అందిస్తాం” అన్నారు. సింధు పరీవాహక ప్రాంతంలోని ఆరు నదులను ప్రస్తావిస్తూ బిలావల్ భుట్టో- జర్దారీ పై ప్రతిపాదన చేశారు.
తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు!
నీటిని ఆపేసిన నాటి నుంచి ఉగ్రవాదుల పుట్ట పాకిస్థాన్ నీటికోసం ఎవరి ద్వా రానో భారత్‌ని వేడుకోని రోజు లేదు. అయినా, భారత్ మాత్రం “అస్సలు నీటిని వదిలే ప్రసక్తే లేదని” హోం మంత్రి అమిత్‌షా కూడా తెగేసి మరీ చెప్పారు. దీంతో పాకిస్థాన్‌కు ఏం చెయ్యాలో పాలు పోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఇలా తాటాకు బెదరింపులకు పాల్పడుతోందని చెప్పాలి.
రెండు శత్రుదేశాల మధ్య ఒకే కారణంగా ఈ సింధునది నీటి ఒప్పందం (ఇండస్ వాటర్ ట్రీటీ ) ఉంది. భారతదేశం పాకిస్థాన్‌ల మధ్య సింధునది, దా ని ఉపనదుల నీటిని పంచుకోవడానికి కుదిరిన ఒక ఒప్పందం ఇది. 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం తో ఆనాటి నాయకులు దీనిని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు సంతకాలు చేశారు.
ఆ మేరకు సింధునది, దాని పరీవాహక నదులను రెండు భాగాలుగా విభజించా రు. తూర్పు నదులు (రావి, బియాస్, సట్లెజ్), పశ్చిమ నదులు (సింధు, జీలం, చీనాబ్) భారతదేశం తూర్పు నదుల నీటిని పూర్తిగా ఉపయోగించుకునే హక్కు ను పొందింది. అయితే పశ్చిమ నదుల నీటిలో ఎక్కువ భాగం పాకిస్థాన్‌కు దక్కిం ది. ఒప్పందం ముఖ్య అంశాల మేరకు తూ ర్పు నదుల నీటిని భారతదేశం పూర్తిగా ఉపయోగించుకుంటుంది.
అయితే, పశ్చిమ నదుల నీటిలో 80 శాతం పాకిస్థాన్, 20 శాతం భారతదేశం వినియోగిం చుకునేలా ఒప్పందం జరిగింది. అంటే, ఈ ఒప్పందం భారతదేశానికి మూడు తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ - జలాలపై నియంత్రణను ఇచ్చింది.- వీటి మొత్తం సగటు వార్షిక ప్రవాహం 41 బిలియన్ క్యూబిక్ మీటర్లు. మరో మూడు పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం నియంత్రణలు పాకిస్థాన్‌కు దక్కాయి. ఈ మూడు నదుల మొత్తం సగటు వార్షిక ప్రవాహం 99 బిలియన్ క్యూబిక్ మీటర్లు నీటిని పాకిస్థాన్‌కు ఇవ్వడం జరిగింది.
ఉదారతను చాటుకున్న భారత్
ఈ ఒప్పందం సమయంలోనే రెండు దేశాల మధ్య నీటి వినియోగం, సమాచారాన్ని పంచుకోవడానికి ఒక శాశ్వత కమి షన్‌ను ఏర్పాటు చేయటం జరిగింది కూ డా. నదీ వ్యవస్థలో డ్యాములు, ఇతర నిర్మాణాల గురించి ఏవైనా వివాదాలు తలెత్తితే ప్రపంచ బ్యాంకు లేదా ఇతర నిపుణుల ద్వారా పరిష్కారమయ్యే ఏర్పాటు జరిగింది. ఈ ఒప్పందం భారతదేశం, పాకిస్థాన్ మధ్య నీటి వనరుల పంపిణీ, వివా దాల పరిష్కారానికి ఒక చట్రాన్ని ఏర్పాటు చేసింది.
ఈ రకంగా రెండు దేశాలు తమ నీటి అవసరాలను తీర్చుకోవడానికి అవకాశం లభించింది. 1960 నుంచి గత ఏప్రిల్ వరకు యథావిధిగా ఈ ఒప్పందం కొనసాగుతూనే వుంది. అందుకే, సింధూజలాల ఒప్పందం నేడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన నీటి భాగస్వామ్య ప్రయత్నాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది కూడా.
అంటే, శత్రు దేశ మైనప్పటికీ అక్కడి ప్రజలు, వ్యవసాయదారులు, ఇతర పరిశ్రమలకు ముఖ్య అవసర మైన నదీ జలాల కోసం ఇబ్బందులు పడకుండా భారత్ చూపుతూ వచ్చిన విశాల హృదయంతో కూడిన నిర్ణయంగానే దీని ని చూడాలి. 2025 ఏప్రిల్ 23న కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్ర వాద దాడి తరువాత, జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ పాకిస్థాన్‌కు ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఖంగు తిన్న పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకు దృష్టికి తెచ్చింది. ఇందులో తనది ఫెసిలిటేటర్ పాత్రకే పరిమితం అయినందున ఈ వివాదంలో జోక్యం చేసుకోబోమని ప్రపంచ బ్యాంకు తెగేసి చెప్పింది. ఒప్పం దం రద్దు తర్వాత భారతదేశం స్వల్పకాలిక శిక్షాత్మక చర్యగా బగ్లిహార్ ఆనకట్ట నుంచి చీనాబ్ నదిపై నీటి ప్రవాహాన్ని నిలిపి వే యాలని నిర్ణయించింది. సలాల్, బగ్లిహార్ ప్రాజెక్టుల రిజర్వాయర్ హోల్డింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి రిజర్వాయర్ ఫ్లషింగ్ చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఆ పాలకుల చేతుల్లోనే భవిష్యత్తు!
ఈ చర్యలు పాకిస్థాన్‌కు తెలియజేయకుండా ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిం చి ఆఫ్- సీజన్‌లో జరిగాయి. ఈ చర్యలు పాకిస్థాన్‌లో వరదలకు కారణమవుతున్నాయని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చా యి. పాకిస్థాన్ జల, విద్యుత్ అభివృద్ధి అథారిటీ వాటిని తిరస్కరించింది. ప్రతి సీ జన్‌కూ నీటి మట్టాలు సాధారణంగా వస్తాయని పేర్కొంది.
అయినా కూడా ఉమ్మడి నదుల నుంచి నీటి ప్రవాహానికి అంతరా యం కలిగించడానికి భారతదేశం చేసే ఏ ప్రయత్నమైనా తమపై యుద్ధచర్యగా పరిగణించబడుతుందని, అణ్వాయుధాలతో భారతదేశంపై దాడి చేయగలదని పాకిస్థాన్ హెచ్చరించినట్లు కూడా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లో జరిగి న ఉగ్రవాద దాడి తర్వాత 2025 ఏప్రిల్‌లో ప్రకటించిన సింధుజలాల ఒప్పం దం సస్పెన్షన్‌ను నిరవధికంగా కొనసాగిస్తామని భారత ప్రభుత్వం జూన్ 21న (2025) మొహమాటం లేకుండా ప్రకటించింది.
గతంలో పాకిస్థాన్‌కు ప్రవహించే పశ్చిమ నదుల నీటిని రాజస్థాన్‌లోని దేశీ య నీటిపారుదల మౌలిక సదుపాయాలవైపు మళ్లించే ప్రణాళికలు కూడా ఆనాడే ఆ ప్రకటనలో ఉన్నాయి. ఒప్పందం అస లు నిబంధనలు ఇకపై చెల్లవని భారత్ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ చట్టం ప్రకా రం భారతదేశం అధికారికంగా జల ఒప్పం దం నుంచి వైదొలగనప్పటికీ, ఆచరణలో ఒప్పంద అమలు శాశ్వతంగా నిలిపి వేయబడిందని యావత్ భారత్ వైఖరిని తేల్చి చెప్పటంతో పాకిస్థాన్‌కు రానున్న రోజుల్లో సాగు భూములు బీడు కాక మానవు. ఇప్పటికైనా ఉగ్రవాదుల పెంపకమా లేక వ్యవ సాయమా అనేది ఆ దేశ పాలకులే తేల్చుకోవాల్సి ఉంది.
- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ సెల్: 9491545699