23-07-2025 12:55:50 AM
డీసీసీ అధ్యక్షుడు కోక్కిరాల విశ్వప్రసాద్ రావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 22 (విజయక్రాంతి):ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభు త్వ లక్ష్యం అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు అన్నా రు. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు సంబంధించిన జీవో నంబర్ 49ని ప్రభుత్వం నిలుపుదల చేసిన సందర్బంగా మంగళవారం జిల్లా కేం ద్రంలోని డీసీసీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క ,కొండా సురేఖ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ ఆదివాసి గిరిజనులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఎందుకు నిదర్శనం జీవో నిలుపుదలనే అన్నారు.జీవో నిలుపుదలపై రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికారుఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్,వాంకిడి,కేరమేరి మండల అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.