calender_icon.png 9 September, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసరి ఆదాయంలో మనదే అగ్రస్థానం

09-09-2025 01:14:26 AM

-కర్ణాటక, హర్యానాలను అధిగమించి రికార్డు

-వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్‌లోనే 

-33.64 శాతం సాధించడం అభినందనీయం 

-ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి

-రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి, ఐదేళ్ల త ర్వాత తొలిసారి ఈ అగ్రస్థానాన్ని సాధించిందని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం స్థిరమైన వృద్ధితో దేశంలోనే అత్యంత చురుకైన ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటిగా ఉంటూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో స మావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రైసింగ్‌లో బ్యాంకర్ల పాత్ర ఉంది ఉన్నారు. 2025 మొదటి త్రైమాసికంలో బ్యాంకులు ప్రాధా న్య రంగ రుణాల విభాగంలో మంచి ఫలితాలు సాధించటం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రాధాన్య రంగంలో వార్షిక రుణ ప్రణాళిక రుణ లక్ష్యాలలో మొదటి త్రైమాసికంలోనే 33.64 శాతం సాధించడం అభినం దనీయమన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెము కగా భావించి, పలు పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ, రైతు భరోసా, కొన్ని పంటలకు బోనస్, ప్రధాన -మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటివి కల్పించిందని తెలిపారు.

వీటి ఫలితంగా వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా పెరుగుతోందన్నారు. గణనీయ సంఖ్యలో కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు పునరుద్ధరించి, రైతులకు నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. పంట ఉత్పత్తి, ముఖ్యంగా ధాన్యం ఉత్పత్తి పెరగడంతో, ఎఫ్‌సీఐకి వరిధాన్యం సరఫరా చేసే ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఎదుగుతోందని వివరించారు. రాష్ర్టంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని, ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు సాధికారత కల్పించేందుకు, ఆదాయ సృష్టి చేసే కార్యకలాపాలకు బ్యాంకులు మరింత రుణ సహాయం అందిచాలని చెప్పారు. ప్రభుత్వ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని రైతులకు సకాలంలో, పెద్ద ఎత్తున బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని కోరారు. 

బలహీనవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి

సమాజంలోని బలహీనవర్గాల అభివృద్ధి కోసం బ్యాంకులు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బ్యాంకర్లను కోరారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధిపొందాలని ఆశిస్తున్న యువకుల పట్ల బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని, ఆస్తులు తాకట్టు పెట్టాలి, బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేయడం సరైనది కాదని చెప్పారు. బ్యాంకింగ్ రంగం ఆర్థిక సాధికారత, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు అభినందిస్తూ, భాగస్వాములందరి మధ్య మరింత బలమైన సహకారం అవసరమని పేర్కొన్నారు. కలిసికట్టుగా మనం తెలంగాణలో సమగ్ర, సాంకేతిక ఆధారిత, సుస్థిర బ్యాంకింగ్ వైపు ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.