calender_icon.png 9 May, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని విభాగాల్లోని ఖాళీలను నింపుతున్నాం

09-05-2025 02:15:46 AM

-ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు

-132 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేతలో మంత్రి పొన్నం

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): అన్ని విభాగాల్లోని ఉద్యోగ ఖాళీలను ఒక్కొక్కటిగా భర్తీ చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కొత్తగా ఎంపికైన 132 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సచివాలయంలో గురువారం నియామకపత్రాలు అందజేయగా, ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా నూతనంగా నియామకపత్రాలు పొందుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. మీరంతా బీసీ సంక్షేమ శాఖ కుటుంబంలో చేరుతున్నారని, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఇది ఆశ్రమం లాంటిదన్నారు. తల్లిదం డ్రులలాగా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు. హాస్టళ్లలోని ఖాళీలను పూర్తిగా భర్తీ చేసినట్టు తెలిపారు.

2023, డిసెంబర్ 7న ఏర్పడిన ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సత్ఫలితాలు వస్తున్నాయని, విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికే మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. పెద్దలకే పరిమితమైన సన్న బియ్యాన్ని సామాన్యుడికి అందిస్తున్నామని చెప్పారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి, దాన్ని గవర్నర్ ఆమోదించి రాష్ర్టపతికి పంపినట్టు మంత్రి పేర్కొన్నారు. బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ ధర్, కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయికుమార్, జైపాల్, జ్ఞానేశ్వర్, కాల్వ సుజాత, వీరయ్య పాల్గొన్నారు.