calender_icon.png 30 September, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతింటి కల సాకారం చేస్తున్నాం

30-09-2025 12:50:33 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, సెప్టెంబర్ 29:  పేదల సొంటింటి కల సాకారం చేస్తున్నామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మొయినాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్ సమీపంలో నూతనంగా నిర్మించిన 36 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 

ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని  , దాన్ని సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధు సూదన్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్, ఆర్డీవో చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొహినుద్దీన్, తహసీల్దార్ గౌతమ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.