calender_icon.png 30 September, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడకతో ఆరోగ్యం పదిలం

30-09-2025 12:49:18 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, సెప్టెంబర్ 29 : ప్రతి రోజూ ఉదయం పూట నడిచే నడకతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. కోత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్ హార్ట్ డే సందర్భంగా సోమవారం  నిర్వహించిన 5కే  వాక్ ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతిరోజు వ్యాయాయం చేసి, గుండెను కాపాడుకోవా లన్నారు. ఇటీవల కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ సాధారణ మోతాదులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఓజోన్ దవాఖాన డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.