22-12-2025 12:35:41 AM
కోదాడ, డిసెంబర్ 21(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం భారతదేశ భీమా రంగంలో ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణం బాలాజీ నగర్ ఏజెంట్ల అసోసియేషన్ భవనంలో అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
భీమా రంగంలోకి విదేశీ సంస్థలు రావడం మూలాన దేశ సంపద విదేశాలు కొల్లగొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్ణయంతో దేశీయ బీమా సంస్థలు దెబ్బ తినడమే కాకుండా సామాన్య ప్రజలు పొదుపు మొత్తాలకు రక్షణ కరువు అవుతుందన్నారు. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా కంజుల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వట్టికూటి మల్లేష్, కోశాధికారిగా పసుపులేటి చిన్న వీరయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ జోనల్ కోశాధికారి బుడిగ వెంకటయ్య, జోనల్ జాయింట్ సెక్రటరీ కొప్పోజు సూర్యనారాయణ, సౌత్ సెంట్రల్ జోన్ మెంబర్ కాంతారావు డివిజన్ అధ్యక్షులు పోతుల రామస్వామి, ప్రధాన కార్యదర్శి దొంతినేని సునీల్ కుమార్, కోశాధికారి రమణారెడ్డి కోదాడ గౌరవ సలహాదారులు పోతుగంటి వెంకటాద్రి, మధుర వెంకటరెడ్డి పాల్గొన్నారు.