22-12-2025 12:37:26 AM
రేవల్లి, డిసెంబర్ 21: ఆదివారం మధ్యాహ్నం గొర్రె పిల్లల మందపై కుక్కల గుంపు దాడి చేయడంతో సుమారు 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. తలుపునూరు గ్రామానికి చెందిన దొడ్డి మల్లేష్ అనే రైతు పొలంలో గొర్రె పిల్లలను ఉంచి పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు మందపై దాడికి దిగాయి. ఈ దాడిలో 25 గొర్రె పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో గా, రైతుకు సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిలింది. జరిగిన నష్టాన్ని మండల పశువైద్యాధికారి ఆంజనేయులుతో తెలుపగా నష్టంపై పూర్తి నివేదికను తహసిల్దార్, ఉన్నతాధికారులకు పంపిస్తామని, బాధిత రైతుకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అప్పులు తెచ్చి గొర్రెలను పెంచుతున్న రైతును, ప్రభుత్వం వెంటనే ఆదుకో వాలని గ్రామాసులు డిమాండ్ చేస్తున్నారు.