18-05-2025 12:38:39 AM
-ఏ రాష్ట్రం కూడా అందుకోలేదు
-పదేళ్లు ఫాహౌస్‌లో పడుకుని మాపై విమర్శలు
-వారికి అభివృద్ధితోనే సమాధానం చెపుతాం
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
భద్రాద్రి కొత్తగూడెం, మే 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అందు కునే శక్తి భారతదేశంలో ఏ రాష్ట్రానికీ లేదని, పదేళ్లు ఫామ్‌హౌస్‌లో పడుకొని ప్రజల సొ మ్ము దుబారా చేసి, మాపై విమర్శలు చేస్తున్నవారికి అభివృద్ధితోనే సమాధానం చెపు తామని డిప్యూటీ సీఎం భిట్టి విక్రమార్క మ ల్లు అన్నారు.
శనివారం భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కేంద్రంలో పలు విద్యుత్ సబ్‌స్టేషన్లకు ఆయన శంకుస్థాపన చేశారు. పాండు రంగపురం వద్ద హైలెవెల్ వంతెనను ప్రారంభించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో లేనంత విద్యుత్ డిమాండ్ వచ్చినప్పటికీ అంతరాయం లేకుండా రికార్డ్ స్థాయిలో సరఫరా చేస్తున్నామన్నారు.
2023 సంవత్సరంలో 15 వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఉండగా గత పాలకులు అది కూడా సమగ్రంగా సరఫరా చేయలేదన్నారు. ఈ మార్చిలో 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినప్పటికీ అంతరాయం లేకుండా సరఫరా చేశామని వివరించారు. ప్రాజెక్టుల నుంచి సాగునీరు కాలువలకు భూసేకరణ చేస్తామని, పంట కాలువ లేకుండా ప్రాజెక్టులు కట్టినా వృథా నే అన్నారు. గోదావరి నదిపై నావిగేషన్‌కు అధ్యయనం చేయిస్తామని చెప్పారు.
పదేళ్లు ప్రజల సొమ్ము దుబారా చేసినోళ్లు తాము చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అవాకులో చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వారికి మాటలతో కాకుండా అభివృద్ధితోనే సమాధానం చెపుతామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టుగా ముందుకు తీసుకుపోతున్నామన్నారు. ప్రాజెక్టు కాలువలకు కావలసిన భూసేకరణ చేపట్టాలని అందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
గిరిజనుల కోసం పథకం
గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇంద్ర సౌర జల వికాసాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 12,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వమే బోర్లు వేయించి సోలా ర్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించి, డ్రిప్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఉద్యాన శాఖ ద్వా రా అవకాడో, వెదరు వంటి పంటలు సాగు చేయిస్తామన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధు లు, అభివృద్ధి పనుల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఢిల్లీలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని, రీజనల్ రింగ్ రోడ్డుకు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య పార్క్ అగ్రికల్చర్ హౌసింగ్ వంటి పలు రకాల క్లస్టర్లను నిర్మించబోతున్నట్లు తెలిపారు.
‘గోదావరి’పై నావిగేషన్ అధ్యయనం చేపట్టాలి: మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమ గ్ర అభివృద్ధికి రోడ్డు, రైల్వే, ఎయిర్, జల రవాణా వ్యవస్థలు ఎంతో అవసరమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గోదావరి నదిపై నావిగేషన్ అధ్యయ నం చేపట్టి జల రవాణాకు ప్రణాళికలు చేపట్టాలని డిప్యూటీ సీఎంను కోరారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే సాం బశివరావు మాట్లాడు తూ.. తన నియోజకవర్గానికి అభివృద్ధి పథకాల కోసం నిధులు మంజూరు చేయాలని ఉపముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రా మసహాయం రఘురామిరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య, కలెక్టర్ జితేష్ వి పా టిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు.