calender_icon.png 3 May, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖజానా లోటువల్లే తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం

02-05-2025 12:00:00 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, మే1 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య పరిపాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏర్పడ్డ లోటు వల్లే సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నామని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఇచ్చిన తులం బంగారం హామీ నెరవేర్చలేక పోతున్నామని, ఆర్థిక పరిస్థితి కుదురుకున్న తర్వాత ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.

మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని 49 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను, సీఎంఆర్ ద్వారా నూట అరవై ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన 44.82 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.  ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసేలా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ 8328473007 ఏర్పాటు చేసినట్లు చెప్పారు.