calender_icon.png 17 January, 2026 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంకణబద్ధులమై పనిచేస్తున్నాం

17-01-2026 03:15:01 AM

  1. సీఎం రేవంత్ రెడ్డితో మారనున్న పాలమూరు రూపురేఖలు 
  2. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసుకుందాం
  3. గోడలకు సున్నాలు వేసి అభివృద్ధి అంటే సరిపోతుందా..?
  4. విధ్వంసం ను చక్కబెడుతూ అభివృద్ధి కి బాటలు వేస్తున్నాం
  5. రూ. 1284.44 కోట్ల పనులకు సీఎం చేతుల మీదుగా నేడు శ్రీకారం
  6. విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్, జనవరి 16 (విజయక్రాంతి): ప్రజల సంక్షేమమే ప్రధాన కర్తవ్యం గా కంకణ బద్ధులమై పనిచేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 1952 సంవత్సరంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆవిష్కృతం అయ్యిందని గడచిన 75 సంవత్సరాల్లో ఎప్పుడు చేయలేనంత అభివృద్ధి ప్రజా పాలన ప్రభుత్వం చేస్తుంద న్నారు.

మన మట్టిబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఉమ్మడి జిల్లాకే కేంద్ర బిందువు అయిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా చేసుకుని కోట్లాది రూపాయలను కేటాయించుకొని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. గడిచిన రెండేళ్ల కాలంలో రూ 2500 కోట్ల నిధులు రావడం జరిగిందని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శనివారం రూ 1284.44 కోట్ల తో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. రూ. 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సి స్కూల్ భవన శంకుస్థాపన, ట్రీబుల్ ఐటీ కళాశాల మూడు విడతలలో నిధులు కేటాయించడం జరుగుతుందని మొదటి విడతలో భాగంగా రూ. 200 కోట్ల ఖర్చు తో భవన శంకుస్థాపన చేయడం జరుగుతుందని మరో రూ 400 కోట్లు రెండు విడతల్లో మంజూరు కానున్నట్లు తెలిపారు.

ఎంవీఎస్ కళాశాలలో అభివృద్ధి పనులకు రూ. 20.50 కోట్ల పనులకు, మిషన్ భగీరథ పనులు నాసిరకంగా చేయడం ద్వారా పలు ఇబ్బందులను పరిష్కరించేందుకుగాను రూ 220.94 కోట్ల పనులకు, పాలమూరు కు తలమానికంగా మారినున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ. 603 కోట్ల పనులకు శంకుస్థాపన, రూ. 40 కోట్ల తో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి  చేతులమీదులుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సీఎం మన బిడ్డ ఉండడంతో మన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎంతో చొరవ ఉందని ప్రతి సమస్యను నేరుగా వెళ్లే చెప్పే వెసులుబాటు అందరికీ ఉండడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు.

హైదరాబాద్ -బెంగళూరు మార్గంలో నాలుగు ప్రధానమైన కేంద్రంగా ఉన్న మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ ప్రాంతాలు కలిపి అతిపెద్ద కార్పొరేషన్ గా భవిష్యత్తులో అవతరించబోతుందని తెలిపారు. మన ప్రాంతంలో ఎడ్యుకేషన్,ఇండస్ట్రియల్, మెడికల్, రవాణా ఈ నాలుగు అంశాలలో మన ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న పోలేపల్లి సజ్జి తో పాటు ఐటీ పార్కు డిఫెన్స్ పార్కులతో మహబూబ్ నగర్ జిల్లా లో అత్యధిక అంశాలతో అభివృద్ధివైపు అడుగులు వేస్తుందని తెలిపారు. రేపటి నుంచి మన ప్రాంత అభివృద్ధి ఎంతో ఉన్నత స్థాయిగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి సభ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. అందరం సమిష్టిగా వచ్చి సభకు హాజరై సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. 

నిర్మాణాత్మక మైనటువంటి అభివృద్ధి చేస్తున్నాం : ఎమ్మెల్యే

 నిర్మాణాత్మక మైనటువంటి అభివృద్ధి చేస్తూ అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విజన్ -2047 లక్ష్యంతో భవిష్యత్తు ఎట్లా ఉండాలి సరైన పంతాలో ముందుకు తీసుకుపోయేందుకు ఇక్కడ పుట్టిన బిడ్డలుగా ఆలోచనలకు పదుల పెడుతూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఉదండాపూర్ రిజర్వాయర్ సంబంధించి ఆర్‌ఎన్‌ఆర్ నో లబ్ధిదారులకు అందజేస్తూ తిరిగి పనులను ప్రారంభిస్తున్నామని ఆపిన ప్రతి పనిని ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. మక్తల్ -నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి రావాల్సిన నీటిని ఓడిసి పట్టుకుంటామని స్పష్టం చేశారు. మరో మూడేళ్ల కాలంలో పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

పాలమూరు ద్రోహులు గత పాలకులు

 గత పాలకులు మాయమాటలు చెప్పి నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం అంగుహార్ బాటలు చేసి పదేళ్ల అద్భుతమైన కాలాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే యెన్నం అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలలో బైపాస్ రోడ్లతో పాటు పెద్ద పెద్ద భవనాలు అద్భుతమైన అభివృద్ధి చేసుకోవడం జరిగిందని,

కెసిఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు ప్రజల గోస తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఏడు నియోజకవర్గం గెలిపిం చుకోవడం జరిగిందని తెలిపారు. ఎంత చేసిన పాలమూరుకు మాత్రం కెసిఆర్ ఏం చేయలేకపోవడం శోచనీయమన్నారు. గత పాలకులు చేసిన తప్పిదలను పూర్తిస్థాయిలో సరి చేసుకుంటూ సక్రమమైన పద్ధతిలో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు

మనసుపెట్టి ఆలోచించి చూడండి...

 జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వ్యక్తి మనసుపెట్టి ఆలోచించి చూడాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వేల కోట్లు నిధులు తీసుకువచ్చి పాలమూరు దశ దిశ మార్చే విధంగా అభివృద్ధి పనులకు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కొంతమంది వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం జరుగుతుందని వాటి అన్ని నమ్మకూడదని, ప్రజాపాలన ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు వేసుకుంటూ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

రాత్రి పగలు భేదం లేకుండా శ్రమిస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అండగా ఉండాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మనపై ఎంతో నమ్మకం ఉంచి కోట్లాది రూపాయలను కేటాయించి అభివృద్ధి పనులకు చేయూతనివ్వడం జరుగుతుందని సీఎం రుణం తీర్చుకునేలా మన అందరం కాంగ్రెస్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

పాలమూరు అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న పాత్ర వహిస్తున్నారని, మన బిడ్డ సీఎం గా లేకుంటే ఇన్ని పనులు జరిగేవి కావాలని తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని టెండర్లు పూర్తి కావడం జరిగిందని మరిన్ని ప్రాసెస్ లో ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.