calender_icon.png 14 October, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

13-10-2025 12:43:00 AM

వెల్దుర్తి అక్టోబర్ 12 : వెల్దుర్తి మండలం దామరంచ అడవి ప్రాంతంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం అందడంతో వెల్దుర్తి మండల ఎస్సై  రాజు తన సిబ్బందితో పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు.

సుమారు 10 మంది వరకు ఉన్నారని, పోలీస్ సిబ్బంది  వచ్చే విషయాన్ని పసిగట్టిన జూదరులు అందులో నుంచి కొంత మంది తప్పించుకోగా, మిగతావారిని, రూ.3.29 లక్షల నగదు, 5 బైకులు, 8 సెల్ ఫోన్లు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై  రాజు  తెలిపారు. అలాగే అక్కడినుండి తప్పించుకున్న వ్యక్తుల కోసం గాలింపు చేపట్టినట్టు   తెలిపారు.