13-07-2024 04:29:46 PM
హైదరాబాద్ : జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిని వెలిగించి నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. విద్యాశాఖకు సంబంధించి రాబోయే కాలంలో ముందంజలో ఉండాలని, కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు మర్చిపోకుండా ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్లోబల్ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఏఐకి సంబంధించి అనేక మంది నిపుణులను పిలిచి వారి ఆలోచనలు తీసుకుంటామన్నారు.