calender_icon.png 15 May, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

31 మంది మావోయిస్టులను మట్టుబెట్టాం

15-05-2025 12:07:11 AM

  1. 450 ఐఈడీలు, 40 ఆయుధాలు, 12వేల కిలోల బియ్యం స్వాధీనం 
  2. వెల్లడించిన సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు 
  3. మావోయిస్టులపై చరిత్రాత్మక విజయం: అమిత్‌షా
  4. శాంతి చర్చలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి: మావోయిస్టులు

చర్ల, మే 14: తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులపాటు సాగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసు లు అధికారులు వెల్లడించారు. 31 మృతదేహాల్లో 28 మంది మావోయిస్టుల గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. హతమైన మావోయిస్టులపై మొత్తం రూ.1.72 కోట్లు రివార్డులు ఉన్నాయని పే ర్కొన్నారు.

సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్‌సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్‌గౌతం బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్రెగుట్టల్లో 450 ఐఈడీలు, 40 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పెద్దఎత్తున ఆయుధ సామగ్రి, డిటొనేటర్లు, పేలుడు పదార్ధాలు, మెడిసన్లు, -ఎలక్ట్రానిక్ పరికారాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

12,000 కేజీల బియ్యం, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కర్రెగుట్టల్లో ఆయుధాలు తయా రు చేసే నాలుగు ఫ్యాక్టరీలు, మోటార్లు, కట్ట ర్లు బయటపడ్డాయన్నారు. 214 బంకర్లు గుర్తించి ధ్వంసం చేసినట్టు చెప్పారు. బంకర్లలో పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చే సుకున్నట్టు వెల్లడించారు. కూబింగ్‌లో 18 మంది జవాన్లు గాయపడ్డారని, వారు ప్రస్తు తం కోలుకుంటున్నారని తెలిపారు.

కాగా మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటను సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తిరస్కరించారు. మావోయిస్టులు 2026 మార్చి 31 లోగా లొంగిపోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కాగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు.

శాంతి చర్చలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి

శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చర్చలకు సుముఖంగా ఉందా లేదన్నది స్పష్టత ఇవ్వాలని మావోయిస్టులు బుధవారం విడుదల చేసిన లేఖలో కోరారు. ఆపరేషన్ కగార్‌ను ఆపి, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రావాలంటూ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరు మీద లేఖ విడుదల చేశారు.

కేంద్ర చర్చలు జరిపేలా భారతదేశవాసులు, ప్రజాస్వామికవాదులు, శాంతికాములు, అంతర్జాతీయ విప్లవ, ప్రజాస్వామిక శక్తులు కృషి చేయాలని లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా  ప్రతిస్పందించాలని కోరారు. 

మావోయిస్టుల ఏరివేతకు అతిపెద్ద ఆపరేషన్: అమిత్‌షా 

కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎక్స్ ద్వారా స్పందించారు. కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టడం మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్‌లో భారత్ సాధించిన చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.

21 రోజుల్లోనే భద్రతా బలగా లు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని ప్రశంసించారు. 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని పేర్కొన్నారు.