23 June, 2026 | 1:05 AM

జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’

23-06-2026 12:10 AM

సభను విజయవంతం చేయాలి

టీఆర్పీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యా రు. జిల్లా అధ్యక్షులు కొమ్మరిశెట్టి నరసింహులు ఆధ్వర్యంలో జిల్లాలోని 16 మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ జూలై 5వ తేదీన భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ము ఖ్యంగా సభ ఏర్పాట్లు, నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

సభను విజయవంతం చేయడం ప్రతి నాయకుడి బాధ్యతగా భావించి కృషి చేయాలని సూచించారు. కొత్తగా నియమితులైన మండలాల అధ్యక్షులకు నియామక పత్రా లు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి పసల ప్రసన్న కుమారి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బుద్ధుల సునీత, జిల్లా నాయకులు బీకు నాయక్‌తో పాటు 16 మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.