calender_icon.png 17 December, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది దశ పోలింగ్ నేడే

17-12-2025 12:00:00 AM

 20న సర్పంచుల ప్రమాణ స్వీకారం

కరీంనగర్, డిసెంబరు 16 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చివరిదైన మూడవ విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈనెల 20న సర్పంచులు ప్రమాణస్వీకారం చేయనున్నా రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాల పరిధిలో ఎన్నికల నిర్వహణ ఏర్పా ట్లు పూర్తి చేశారు. 386 నర్పంచ్ స్థానాలకు 1580 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కరీంనగర్ జిల్లాలో 111 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా 108 స్థానాలకు 454 మంది బరిలో నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 పంచాయతీలకు 7 ఏకగ్రీవం కాగా 80 స్థా నాలకు 379 మంది, జగిత్యాల జిల్లాలో 119 గ్రామ పంచాయతీలకు 6 ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు 456 మంది, పెద్దపల్లి జి ల్లాలో 91 గ్రామ పంచాయతీలలో 6 ఏకగ్రీ వం కాగా 85 సాధనాలకు 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

- రాజన్న సిరిసిల్ల జిల్లాలో....

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మం డలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నా లుగు మండలాల్లో మొత్తం పంచాయతీలు 87, వార్డు స్థానాలు 762 ఉండగా, 7 స ర్పంచ్ స్థానాలు, 211 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 80 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్లకుగాను 379 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలు జరగనున్న 551 వార్డు స్థానాల్లో 1526 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 551 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు..

- కరీంనగర్ జిల్లాలో...

కరీంనగర్ జిల్లాలో మూడవ విడతలో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలాల్లోని 111 పం చాయతీలు ఉండగా మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 108 గ్రామ పంచాయతీలకుగాను 454 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇల్లందకుంటలో 15 సర్పంచ్ స్థానాలకు 78 మంది, హుజూరాబాద్లో 20 సర్పంచ్ స్థానాలకు 81 మంది, జమ్మికుంటలో 20 స్థానాలకు 90 మంది, వీణవం కలో 25 సర్పంచ్ స్థానాలకు 110 మంది, సైదాపూర్లో 26 సర్పంచ్ స్థానాలకు 95 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 1034 వార్డుల ఉండగా 184 ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరగనున్న 850 వార్డులలో 24 21 మంది పోటీ పడుతున్నారు.

- పెద్దపల్లి జిల్లాలో.....

పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు, ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లోని 91 గ్రామ పంచాయతీల్లో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 85 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 85 పంచాయతీల్లో 300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎ లిగేడులో 11 గ్రామ పంచాయతీలకు 32 మంది, ఓదెలలో 21 పంచాయతీలకు 66 మంది, పెద్దపల్లిలో 29 సర్పంచ్ స్థానాలకు 87 మంది, సుల్తానాబాద్లో 24 సర్పంచ్ స్థా నాలకు 85 మంది పోటీ పడుతున్నారు. మొ త్తం వార్డులు 852 ఉండగా 215 వార్డులు ఏకగ్రీవం కాగా 636 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ వార్డులకు 1797 మంది పోటీ పడుతున్నారు.

- జగిత్యాల జిల్లాలో...

జగిత్యాల జిల్లాలో 119 గ్రామ పంచాయతీల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా 113 స్థా నాలకు 456 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయి.

- 24 గంటలు కరెంట్ ఉండేలా చర్యలు...

ఎన్నికల సిబ్బంది ఎన్నికలకు ఒక రోజు ముందే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ మెటీరియల్ ను తమ తమ డ్యూటీ ప్రాంతాలకు తీసుకువెళ్లారు. పోలింగ్ సిబ్బందితోపాటు కేంద్రాల వద్ద ఇబ్బంది కలగ కుండా విద్యుత్ సరఫరాకు అంతరా యం లేకుండా 24 గంటలు కరెంట్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. తాగునీరు, పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. 

అధికారులు సమన్వయంతో ఎన్నికలను విజయవంతం నిర్వహించాలని, చెక్ లిస్టులను చూసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచనలు చేశారు.