calender_icon.png 10 July, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతగా ‘భరోసా’ అందిస్తున్నాం

10-07-2025 12:03:19 AM

  1. మహిళల పేరుపైనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం 

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ జులై 9 (విజయ క్రాంతి) : ప్రతి ఒక్కరూ బాగుపడాలనే లక్ష్యంతోనే బాధ్యతగా భరోసా పథకాలను అందిస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రూ 3.10 కోట్ల తో ఒకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి, రూ 2 కోట్ల తో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల ని ర్మాణానికి శంకుస్థాపన, హన్వాడ మండలం బుద్దారం గ్రామంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.

ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించేందుకు మంజూరు పత్రాలను అందించే అవకాశం రావడం గొప్ప విషయం భావిస్తున్నానన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా గడపాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. విద్యా ర్థుల సంక్షేమం కోసం ప్రత్యేక విద్యాసంస్థలను తీసుకురావడం జరుగుతుందని వివరించారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మారే పల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నవనీత, టంకర కృష్ణయ్య యాదవ్, కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, వెంకటయ్య, యాదిరెడ్డి, బొట్టు శ్రీను, రాజలింగం, పిడి శారద, తహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపిడిఓ యశోద , మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.