calender_icon.png 26 January, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం

26-01-2026 12:18:42 AM

  1. రూ.3 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, జనవరి 25 (విజయక్రాంతి) : అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన వి ద్యుత్ను అందిస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని పాత పాలమూరు బాలాజీనగర్ ప్రాంతంలో రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ ప నులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శం కుస్థాపన, 20వ డివిజన్ లో రూ 8 లక్షలతో నిర్మించనున్న అండర్ డ్రైనేజ్ పంనుల కుఎమ్మెల్యే శంకుస్థాపనను చేశారు.

ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత పాలమూరు ప్రాంతంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాల నేపథ్యంలో విద్యుత్ అవసరాలు గణనీయం గా పెరిగాయని తెలిపారు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ సబ్ స్టేషన్ను మం జూరు చేయించడం జరిగిందన్నారు. ఈ వి ద్యుత్ సబ్ స్టేషన్ పూర్తయితే తక్కువ వోల్టేజ్ సమస్యలు, తరచూ విద్యుత్ అంతరాయాలు పూర్తిగా తగ్గి, ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. 

మహబూబ్ నగర్ను అ భివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమం తో పాటు విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి ప్రాథమిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రతి ప్రాంతానికి సమాన న్యాయం జరిగేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. భీమానాయక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి,

జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్.పి. వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లంగారి భరత్ కుమార్, ఎర్పుల నాగరాజు, సంగీత శంకర్, పాపగల్ల రాజు, రమేష్ బాబు, లక్ష్మణ్, టి. నాగయ్యతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.