26-01-2026 12:22:08 AM
ఎన్‌సీఐసీ ఫౌండర్ సిఎ డానియల్ ఆడమ్స్
ముషీరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): మత మార్పిడి అసత్య ఆరోపణల్లో జైల్లో ఉన్న క్రైస్తవులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎన్.సి.ఐ.సి ఫౌండర్ సి.ఎ.డానియల్ ఆడమ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒరిస్సాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవచేస్తూ మతోన్మాదుల దాడిలో సజీవ దహనానికి గురైన క్రైస్తవ మిషనరీ పాస్టర్ డాక్టర్ గ్రహం స్టెయిన్స్, అతని ఇద్దరు కుమారులు ఫిలిప్, తిమోతిలో 27వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
అనంతరం జెరూసలేం మత్తయ్యతో కలసి ఆయన మాట్లాడుతూ దేశంలో క్రైస్తవులపై వరుసగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ క్రైస్తవులకు రక్షణ కలిగించాలని, అమాయకమైన పాస్టర్లపై పెట్టిన అసత్య కేసులను తక్షణం ఉపసంహరించి, వెంటనే జైల్లో నుం డి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరికె వరప్రసాద్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రె స్ జాతీయ కార్యదర్శి చెట్టుపల్లి ఎస్తేర్ రాణి, సీనియర్ క్రైస్తవ నాయకులు ఎ.బి.గిడియాన్ సిఐఎఫ్, హెబ్రోన్ సైమన్, సోలమన్ అగ్నిజ్వాల, జవహర్ కెన్నెడీ, గ్లోరి ఆనంద, జెరుషలేము మత్తయ్య, మైఖెల్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.