26-01-2026 12:16:54 AM
భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్ బాలకోటి
భూత్పూర్, జనవరి 25 : జరుగనున్న భూత్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ఎ మ్మెల్యే జి. సుధన్ రెడ్డి అన్నారు. ఆదివారం అమిస్తాపూర్ నుంచి భూత్పూర్ పట్టణం వరకు భారీ ర్యాలీతో బిఆర్‌ఎస్ పా ర్టీ 1వ వార్డు మాజీ కౌన్సిలర్ బాలకోటి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం బీఆర్‌ఎస్ మాజీ వార్డు మెంబర్ నరసింహ, రమేష్, సాబెర్, సైఫ్, ముస్తాక్ తో పాటు వందలాది మందికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బాలకోటి మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలలో దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భూత్పూర్ మున్సిపాలిటీలోని తండాలకు రోడ్లు వేయలేదని, మున్సిపాలిటీ అభివృద్ధిని కూడా పట్టించుకోలేదని గత ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేవరకద్ర నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించమన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి మున్సిపాలిటీలోని సమస్యలను గుర్తించి రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థను మెరుగుపరిచామని, రూ 20 కోట్ల నిధులతో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ డాక్టర్ కదిరి శేఖర్ రెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లిక్కీ విజయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్యానాయక్, నరేందర్, బోరింగ్ నర్సింలు, మనన్, మట్టి ఆనంద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.