04-01-2026 12:00:00 AM
సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో పలువురు వక్తలు
మహిళా శక్తికి ప్రతీక.. సావిత్రీబాయి పూలే
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ జయలక్ష్మి
ముషీరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ప్రజలను జాగృతం చేసిన గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె ఆలోచన విధానాలను మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ మంథని ఆర్థిక సహకార సౌజన్యంతో తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు శైలజ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, కదిరే కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశా చారి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం, వివక్షతను రూపుమాపేది విద్యతోనే అని సావిత్రిబాయి పూలే తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. సావిత్రిబాయి పూలే బహుజన సంబంధించిన స్త్రీ కాదని, కులం మతం లేకుండా అందరినీ సమానంగా చూసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఈ ఉత్సవాల్లో పూలే జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.
అనంతరం పలువురు ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవాలకు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
మలక్‌పేట్/ఉప్పల్/సనత్‌నగ్/రంగారెడ్డి/ చేవెళ్ల/మేడ్చల్, జనవరి 3 (విజయక్రాంతి): సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏక్తా జనశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి అధ్యక్షుడు రాజేష్ యాదవ్ పూలమాలవేసి ఘననివాళులు అర్పించారు. మలపేటలోని వాణి ప్రభుత్వ పాఠశా లలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సావిత్రి బాయి చిత్రపటానికి పలువురు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వాణీ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్య, రామలక్ష్మి, శారద, ’శ్రీవాణి, సుమలత, కల్పన పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఉప్పల్‌లో..
మహిళల చదువు,అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిభాయి ఫూలే ఆశయ సాధనకు నేటి విద్యార్థులు, యువత కృషి చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి.సత్య ప్రసాద్ అన్నారు.
సావిత్రిభాయి ఫూలే 195వ జయంతిని ఏఐవైఎఫ్,ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని అంబేద్కర్ కూడలి వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నేతలు మహేష్, అజీమ్,రవళి, కీర్తన, భావన,ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, సాయి, శేఖర్, మధురిమ, కీర్తన్, రవళి, సరిత,దీప్తి, రమ్య, శృతి, సునయన, బేగం, సుహానా లతో పాటు 50 మంది పాల్గొన్నారు.
చేవెళ్ల సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్లో..
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్లో భారతదేశ మహిళా విద్యకు అగ్రగామిగా నిలిచిన సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రెహానా, మహిళా ఉపాధ్యాయులను సన్మా నించి వారి సేవలను కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే విలువలను జీవితంలో పాటించాలనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.
సనత్‌నగర్ బీసీ సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో..
సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తూ బీసీ సంక్షేమ సంఘం, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి, శ్రీ బాల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సరఫ్ సంతోష్ మరియు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ సభ్యులు సర్దార్ సురేందర్ సింగ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సావిత్రి బాయి ఫూలే జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మేడ్చల్‌లో..
ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే 195వ జయంతి వేడుకలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చ ల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మేడ్చల్ నియోజకవర్గ ఎ బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఉపాధ్యాయురాలు మంజుల అందరిని శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్‌లు రామన్నగారి మణికంఠ గౌడ్. కౌడే మహేష్ లతోపాటు నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్, పాలకుర్తి రాఘవేందర్ గౌడ్. ప్రేమలత, లక్ష్మణ్ రావు, లవంగ్ రాకేష్, దండు శ్రీకాంత్, గుండా శ్రీధర్, వంజరి సన్నీ కుమార్, అనిల్ కుమార్, వేముల రంజిత్ రెడ్డి, ఎర్ర విజయ్ రావు, తాళ్లపల్లి రమేష్ గుప్తా, సిహెచ్ సత్యనారాయణ యాదవ్, తాళ్లపల్లి నరసింహులు పటేల్, ఓంకార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డిలో..
విద్యార్థులకు విద్యా బోధనతోపాటు సామాజిక రుగ్మతలను తొలగిం చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. దేశ తొలి మహి ళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతినీ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ మహిళ ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళు లు అర్పించారు.
అనంతరం ఎంపిక చేసిన 13 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ శాలువా, పూల మాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పూలే దంపతుల విగ్రహాలకు నివాళి
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 3 (విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే మహిళా శక్తికి ప్రతీక అని, విద్యనే ఆయుధంగా మలుచుకుని సమానత్వం కోసం పోరాడిన ఆమె జీవితం అందరికీ మార్గదర్శకమని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ జయలక్ష్మిఅన్నారు. శనివారం సావిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న సావిత్రీబాయి పూలే, జ్యోతిరావ్ పూలే నిలువెత్తు విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మహిళల విద్యాభివృద్ధికి సావిత్రీబాయి పూలే చేసిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. ఆమె జయంతి రోజైన జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు.