17-10-2025 12:58:34 AM
-పథకాలు చివరి లబ్ధిదారుని వరకు అందాలి
-సమాజంలోని మూఢాచారాలు పారద్రోలాలి
-గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మహబూబ్ నగర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదా రుని వరకు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం మహబూ బ్ నగర్ జిల్లాలోని సమీకృత కార్యాలయా ల సముదాయం సమావేశ మందిరం లో నిర్వహించిన అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వికసిత్ భారత్‌లో భాగంగా జిల్లాలోని 1,441 మంది చెంచుల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు చివరి లబ్ధిదారునికి అందాలన్నారు. భారత దేశాన్ని క్షయ వ్యాధి రహిత దేశంగా తీర్చిదిద్దడంలో సామాజిక ప్రముఖులు,కళాకారులు, రచయితలు, భాగస్వాములు కావా లని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న ప్రధాన మంత్రి జన్మన్, దర్తి ఆబా అభియాన్ పథకాల ద్వారా, స్వయం ఉపా ధి, సౌర విద్యుత్తు, పక్కా ఇండ్లు,విద్య తదితర పథకాలు చెంచులకు అందే విధంగా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షయ వ్యాధి ముందస్తు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని, క్షయ రహి త జిల్లా, రాష్ట్రంగా రూపొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాజంలో ఉన్న మూఢాచారాలు, రుగ్మతలను పారద్రోలడంలో సామాజిక కార్యకర్తలు, ప్రముఖు లు, రచయితలు, కవులు, కళాకారులు వీధి నాటకాలు, జానపద గేయాలు,రచనలు , ద్వారా అవగాహన కల్పించి సామాజిక రుగ్మతలను, క్షయ వ్యాధిని రూపుమాపడంలో తమవంతు కృషి చేయాలని సూచిం చారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు వినూత్న కార్యక్రమాల ద్వారా చెంచు లు, ఆదివాసీ మహిళలను మహిళా సంఘాలలో చేర్చుకుంటూ వారి ఆర్థిక స్వావలంబ న అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా విశిష్టత, ప్రముఖ పర్యాటక స్థలాలు, విద్య, వైద్యం, వివిధ శాఖల ద్వారా సాధించిన అభివృద్ధి పై ప వర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యా లయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ విజయేందిర బో యి, అదనపు కలెక్టర్‌లు శివేంద్ర ప్రతాప్, మ ధుసూదన్ నాయక్‌లు స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తర్వాత గవర్నర్ గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య శాఖ, మెప్మా ద్వారా, రెడ్ క్రాస్ సొసైటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖలు ఏర్పాటు చెందిన స్టాళ్లను పరిశీలించారు. ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద చెంచులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ కు ఏర్పాటు చేసిన మొబైల్ వైద్య వాహనాన్ని గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మొక్క నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్, ఐజీ ఎల్‌ఎస్‌చౌహాన్, ఎస్పీ జానకి పాల్గొన్నారు.