17-10-2025 12:58:53 AM
శేరిలింగంపల్లి, అక్టోబర్ 16: ఆర్టీసీ మియాపూర్ డిపో-2 పరిధిలో ఈనెల 18న (శుక్రవారం) డయల్ యువర్ డి ఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశం గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డిపో పరిధిలోని మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్ తో పాటుగా నిజాంపేట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించిన సమస్యలతో పాటుగా సూచనలు సలహాలు తెలిపేందుకు గాను డయల్ యువర్ డిఎం కార్యక్రమం దోహదపడుతుందని డిపో మేనేజర్ సూచించారు.
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226420 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.