21-11-2025 12:37:03 AM
ఎమ్మెల్యే డా.హరీష్‌బాబు
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 20(విజయక్రాంతి): కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. గురువారం సిర్పూర్ టి మండలంలోని రైతు వేదికలో 23 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ ఆడపిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం లాంఛనంగా ఇస్తున్న ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆసిఫాబాద్ నుండి మాకుడి వరకు డబల్ బీటీ రోడ్డు, అచ్చెల్లి నుండి ఆరేగూడ వరకు బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ను కలిసి సిర్పూర్(టి) రైల్వే స్టేషన్ కు సంబంధించి పలు అభివృద్ధి పనుల గురించి వివ రించానని,దక్షిణ్ ఎక్స్ ప్రెస్, బల్లార్షా ఎక్స్ప్రెస్ లకు సిర్పూర్ టౌన్‌లో అదనపు స్టాపేజీ , భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ సిర్పూర్ వరకు పొడిగిం చాలని కోరడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఆర్‌ఐ ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్లు వేణు, సాయి, భాజపా మండల అధ్యక్షులు లావణ్య, తదితరులు పాల్గొన్నారు.