21-11-2025 12:37:11 AM
చేగుంట, నవంబర్ 20 :సెల్ ఫోన్ కోసం యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొంతి నాగ రాజు గౌడ్ తన కూతురు మహాలక్ష్మి (18) ఫోన్ ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ విషయంలో మహాలక్ష్మి తండ్రితో కొత్త ఫోన్ కావాలని గొడవ పడింది.
తండ్రి నాగరాజు గౌడ్ కొత్త ఫోన్ రేపు కొనిస్తానని చెప్పినప్పటికీ మహాలక్ష్మి తీవ్రంగా మనస్తాపం చెంది, ఇంటిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించి మృతదేహాన్ని తూప్రాన్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మహాలక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.