calender_icon.png 15 November, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి..

15-11-2025 08:16:56 PM

బీర్సా ముండా జయంతి వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యేల వెల్లడి..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది అసువులు బాసిన గిరిజన యోధుల పోరాటలను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం మనమందరం ముందుకు సాగాలని ఎంపీ గోడం నగేష్ అన్నారు. కాంతివీర్ భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఆ పోరాటయోధుని విగ్రహానికి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదివాసీ సంఘాల నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆనాడు ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన గొప్ప యోధుడని గుర్తు చేశారు. బీర్సా ముండా, కొమరం భీం ఇలా అనేక మంది పోరాటయోధులను స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కోట్లాది నిధులను వెచ్చించి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతోందన్నారు. బీర్సా ముండా పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, ఆదివాసీ నాయకులు సిడం రామ్ కిషన్, తానాజీ, తదితరులు పాల్గొన్నారు.