15-11-2025 08:14:38 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాతంగళ్లపల్లి మండలంలో వెన్నమనేని శ్రీధర్ రావు నేతృత్వంలో నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో కార్యకర్తల సమన్వయం, రాబోయే కార్యక్రమాల ప్రణాళికపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హాజర కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంచార్జిలుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్ పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
అలాగే జిల్లా కౌన్సిల్ మెంబర్ కోలా ఆంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్, మహిళా మండల అధ్యక్షులు కొడం భవిత, జిల్లా కోశాధికారి రామలింగారెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జూకంటి అఖిల్ హాజరై పార్టీ అభివృద్ధిపై కీలక సూచనలు చేశారు. బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు భారీగా హాజరై తమ శక్తిని చాటుకోవడంతో సమావేశం ఉత్సాహభరితంగా సాగింది. పార్టీ ముందున్న లక్ష్యాల సాధనలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని నాయకులు స్పష్టం చేశారు.